News June 3, 2024

BREAKING: చిట్యాల వద్ద యాక్సిడెంట్

image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది.

Similar News

News December 15, 2025

మర్రిగూడ: సాఫ్ట్‌వేర్ to సర్పంచ్

image

సొంతూరుకు సేవ చేయాలనే తపనతో మర్రిగూడకు చెందిన వీరమల్ల శిరీష అనే వివాహిత సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకొని సర్పంచ్‌గా ఎన్నికయింది. శిరీష ఎంటెక్ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

News December 15, 2025

NLG: సాఫ్ట్‌వేర్‌ TO సర్పంచ్‌

image

సొంతూరుకు సేవచేయాలని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన యువకుడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా అనుముల (M)ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎడవల్లి వంశీకృష్ణ విజయం సాధించారు. వంశీకృష్ణ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.

News December 15, 2025

NLG: రెండో విడతలోనూ ఆ పార్టీదే హవా

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టారు. మొదటి రెండో విడతలో 597 స్థానాలకు ఎన్నికలు జరగగా అందులో 407 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ మద్దతుదారులు 146 స్థానాలు గెలుపొందారు. సీపీఐ, సీపీఎం, ఇతరులు కలుపుకొని రెండు విడతల్లో 40 మంది గెలుపొందగా.. బీజేపీ 4 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది. రెండో విడతలోను బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు.