News February 13, 2026

BREAKING: చెన్నూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

image

మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలాకా చెన్నూరు మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 18 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 4 వార్డులు BRS, 2 వార్డులు బీజేపీ, 1 వార్డు ఇతరులు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Similar News

News March 9, 2026

‘కల్కి’ కోసం కమల్ హాసన్‌కు రోజుకు ₹15 కోట్లు?

image

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్‌పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

News March 9, 2026

విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..!

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సోమవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 1,836 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2,111 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.

News March 9, 2026

HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

image

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.