News August 16, 2024

BREAKING: చౌటుప్పల్: 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్నారు..!

image

గంజాయి ముఠాను సుమారు 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. HYD-విజయవాడ హైవేలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నలుగురు సభ్యులున్న ఓ గంజాయి ముఠాను నల్గొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఈరోజు పసిగట్టారు. అక్కడ వారిని అడ్డుకోగా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకోవడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంబడించి HYD శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ JNNURM వద్ద అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు.

Similar News

News November 25, 2025

NLG: రిజర్వేషన్లు.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన జీవో 46 ద్వారా ఖరారు చేసిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లతో సీట్లు తారుమారై అలజడి రేపింది. గ్రామాల్లో ఉన్న జనాభా ధామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో ఈ సారి తమకే రిజర్వేషన్ ఖరారవుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించిన నాయకులకు రిజర్వేషన్ల మార్పులతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్లు కొందరి జాతకాలను తారుమారు చేశాయి.

News November 25, 2025

జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

image

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.

News November 25, 2025

NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

image

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.