News July 26, 2024
BREAKING: జగిత్యాల: గురుకుల విద్యార్థి మృతి
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకులంలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఈరోజు తెల్లవారుజామున అస్వస్థతకు గురైంది. దీంతో సిబ్బంది ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 4, 2024
కరీంనగర్: నేడు ముద్దపప్పు బతుకమ్మ
కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి పూజలు చేస్తారు. ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు కాబట్టి ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పిలుస్తారు. మూడోరోజు వాయినంగా ముద్దపప్పు, సత్తుపిండి, పెసర్లు, బెల్లం కలిపి పెడతారు.
News October 4, 2024
దుర్గామాతను దర్శించుకున్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి
రామగుండం మున్సిపల్ పరిధిలోని 42వ డివిజన్, 50వ డివిజన్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని దుర్గామాతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దుర్గామాతను మొదటి రోజు రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వారిని ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం చేశారు.
News October 4, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొలువుదిరిన దుర్గ మాతలు @ కొండగట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. @ దసరా లోపు టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. @ ఎల్లారెడ్డిపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. @ కేశవపట్నం పోలీస్స్టేషన్ లో నాగుపాము హల్చల్.