News May 12, 2024

BREAKING.. జనగామ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్ వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొని లచ్చమ్మ(70) మృతి చెందింది. కాగా, స్టేషన్ ఘన్‌పూర్లో కారు-స్కూటీ ఢీకొని రమేశ్(55) మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2025

ఎనుమాముల మార్కెట్ సెక్రటరీ సస్పెండ్

image

ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల సస్పెండ్‌కు గురయ్యారు. జిల్లా పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. మార్కెట్ సెక్రటరీ సస్పెండ్ హాట్ టాపిక్‌గా మారింది.

News February 12, 2025

2కె రన్ ప్రారంభించిన వరంగల్ సీపీ

image

‘SAY NO TO DRUGS,’ డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం అనే నినాదంతో వరంగల్ నగరంలో ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్(TSJU) ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. పోచంమైదాన్ కూడలి నుంచి కేఎంసీ వరకు జరుగుతున్న ఈ రన్‌ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు, వైద్యులు, యువత పాల్గొన్నారు.

News February 12, 2025

వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

error: Content is protected !!