News March 25, 2025

BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

image

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 29, 2025

సినిమాలు వద్దని నిరాశపరిచారు: జెనీలియా

image

వివాహం తర్వాత సినిమాల్లో తిరిగి నటిద్దామంటే తెలిసిన వాళ్లు ఎవరూ సహకరించలేదని సినీ నటి జెనీలియా అన్నారు. పదేళ్ల తర్వాత సినిమాలోకి వస్తే ఏమాత్రం వర్కౌట్ కాదు అని నిరాశపరిచారన్నారు. అయినా వారి మాటలు వినకుండా ధైర్యంతో మూవీల్లో తిరిగి నటించానని తెలిపారు. 2022లో జెనీలియా నటించిన ‘వేద్’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో జెనీలియా నటించారు.

News March 29, 2025

శ్రీవారి సేవలో శాసనమండలి ఛైర్మన్

image

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, సిపాయి సుబ్రమణ్యంలతో కలిసి రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి దర్శించుకున్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించి, ఆలయ అధికారులు స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

News March 29, 2025

JRG: స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి 

image

జంగారెడ్డిగూడెం (M) కొంగువారిగూడెం కెకెఎం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వంశీ (25), వంశీ కృష్ణ(23) ఇద్దరు యువకులు శనివారం జలాశయం ప్రాంతానికి వెళ్లారు. కాలువలోకి స్నానానికి దిగిన వీరిద్దరూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!