News April 8, 2025
BREAKING: దేవరకద్రలో 3 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్..!

దేవరకద్ర మండల కేంద్రంలోని RMP ప్రైవేటు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య బృందం సోమవారం తనిఖీ చేసింది. కొందరు నకిలీ RMP డాక్టర్లు ఎలాంటి అర్హత లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పట్టణంలోని సత్యసాయి క్లినిక్, సత్యశిలారెడ్డి అమ్మ క్లినిక్, శ్రీసాయి క్లినిక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News December 5, 2025
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన అంశాలివే!

ఈ ఏడాది ఎక్కువగా శోధించిన అంశాల జాబితాను ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ప్లాట్‌ఫామ్ ‘Google’ రిలీజ్ చేసింది. ‘ఓవరాల్ ట్రెండింగ్ సెర్చ్’ విభాగంలో IPL అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత Google Gemini, Asia Cup, ICC Champions Trophy, Pro Kabaddi League, Maha Kumbh, Women’s World Cup, Grok, Saiyaara, ‘Dharmendra’ గురించి తెగ సెర్చ్ చేసినట్లు తెలిపింది. మరి మీరు ఏ విషయం గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు? COMMENT
News December 5, 2025
ఆదిలాబాద్: వారి ఓటమే.. వీరి లక్ష్యం

ఉమ్మడి ఆదిలాబాద్‌లో 1,514 గ్రామపంచాయతీలకు ఇప్పటికే తొలి, రెండో విడత నామినేషన్లు పూర్తయ్యాయి. నేటితో (శుక్రవారం) మూడో విడత నామినేషన్లు పూర్తి కానున్నాయి. ప్రధాన పార్టీల మద్దతుదారులు ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా పలు గ్రామాల్లో పలువురు డమ్మీ అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు ఓట్లు చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రత్యర్థి అభ్యర్థులకు తలనొప్పిగా మారింది.
News December 5, 2025
జగిత్యాల అదనపు SP స్ఫూర్తిదాయక కథనం

కలలను నిజం చేసుకోవాలంటే దృఢ సంకల్పం, నిబద్ధత అవసరం. అదే పట్టుదలతో సివిల్స్‌లో 401 ర్యాంక్ సాధించి ప్రశంసలు అందుకున్నారు జగిత్యాల అదనపు SP శేషాద్రిని రెడ్డి. ఈమె స్వస్థలం నల్గొండ జిల్లా లింగారెడ్డిగూడెం. పుట్టిపెరిగింది హైదరాబాదులో. కంది IITలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత 2019లో సివిల్స్ రాసినా ర్యాంకు రాలేదు. 2020లో రెండో ప్రయత్నంలో IPSకు ఎంపికై శిక్షణానంతరం వేములవాడ ASPగా బాధ్యతలు తీసుకున్నారు.


