News April 8, 2025
BREAKING: దేవరకద్రలో 3 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్..!

దేవరకద్ర మండల కేంద్రంలోని RMP ప్రైవేటు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య బృందం సోమవారం తనిఖీ చేసింది. కొందరు నకిలీ RMP డాక్టర్లు ఎలాంటి అర్హత లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పట్టణంలోని సత్యసాయి క్లినిక్, సత్యశిలారెడ్డి అమ్మ క్లినిక్, శ్రీసాయి క్లినిక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Similar News
News February 24, 2026
నేను ఎంతకాలం ఉంటానో తెలీదు.. ప్రాణహానిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్‌లోకి చొరబడటానికి యత్నించిన ఓ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ ట్రంప్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎంతకాలం ఇక్కడ ఉంటానో నాకు తెలీదు. చాలామంది నన్ను టార్గెట్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభావవంతమైన నేతలపైనే ఇలాంటి దాడులు జరుగుతాయంటూ లింకన్, కెన్నెడీ వంటి వారిని అందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.
News February 24, 2026
భాగ్యనగరంలో భారీ వర్షం.. రాబోయే కొన్ని గంటలు అలర్ట్!

HYDలో అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్‌బాగ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో GHMC వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండొచ్చని మ్యాప్ విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకొన్నాయి.
News February 24, 2026
మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||


