News November 18, 2024
BREAKING: దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు సమీపంలో గల వెలిగొండ ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న తల్లి, కూతురు లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Similar News
News December 23, 2025
మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలి: కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజనం అమలుకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజాబాబు అధ్యక్షత నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం నూరు శాతం అమలుజరగడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, నాణ్యత లోపాలు లేకుండా చూడాలన్నారు.
News December 23, 2025
రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌ను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

ఒంగోలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో రెడ్ క్రాస్ సంస్థను అభివృద్ధి చేయడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ సభ్యులు, అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్‌కు కొదువ లేకుండా చూడాలన్నారు.
News December 23, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 89 ఫిర్యాదులు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి, ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఆదేశించారు.


