News February 27, 2025

BREAKING: ధారూర్‌లో మొండెం నుంచి వేరైన తల!

image

ధారూర్‌ PS పరిధిలో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్‌పై మొండెం నుంచి తల వేరైన దృశ్యం స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యనా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 22, 2025

చారకొండ: మాజీ ఆర్మీ జవాన్ విగ్రహం ధ్వంసం

image

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని బోడబండ తండాకు చెందిన మాజీ ఆర్మీ జవాన్ మహిపాల్ నాయక్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాణవత్ శంకర్ నాయక్ డిమండ్ చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సిగ్గు చేటని అన్నారు. దుండగులు విగ్రహం ముక్కు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈఘటనకు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు.

News March 22, 2025

అచ్చంపేట: ప్రమాదకరంగా మారిన కల్వర్టు

image

అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టుకు రక్షణ లేక ప్రమాదకరంగా మారింది. ఈ ప్రధాన రహదారిపై రోజుకు హైదరాబాద్, దేవరకొండ ప్రాంతాలకు వందల సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయి. ఈ రహదారి పై ఉన్న కల్వర్టుకు రెండు వైపులా ఎలాంటి రెయిలింగ్‌ లేకపోవడంతో వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయాల్లో ఈ రూట్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

News March 22, 2025

ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం: కలెక్టర్

image

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కూడేరు మండలం చోళ సముద్రంలో రైతు ఎర్రస్వామి పొలంలో ఫారంపాండ్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ పనులను శనివారం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఫారంపాండ్ పనులకు భూమిపూజ చేశామన్నారు. ఫారంపాండ్‌తో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.

error: Content is protected !!