News May 24, 2024

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి జాతీయ రహదారిపై కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శ్రీను, కనకయ్య బైక్‌పై మల్లేపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో బైక్ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News December 26, 2025

పేదల పక్షాన శతాబ్ది పోరాటం: ఎమ్మెల్సీ సత్యం

image

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించిన పోరాటాలు అద్వితీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మగ్దూమ్ భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. 1925లో కాన్పూర్‌లో ఆవిర్భవించిన నాటి నుంచి రైతు, కూలీ, అణగారిన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.

News December 26, 2025

NLG: రైతన్నకు ‘యాప్‘ సోపాలు..!

image

జిల్లాలో రైతన్నలకు ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’తో కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో యాసంగిలో 6.57 లక్షల ఎకరాల్లో అధికారులు సాగు అంచనా వేశారు. జిల్లాలో ఎరువులను అందుబాటులో ఉంచాల్సిందిపోయి. ఈ కొత్త యాప్ పనిచేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రారంభించిన తొలిరోజు నుంచి సరిగ్గా పనిచేయకపోవడంతో యాసంగిలో కష్టాలు తప్పేలా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి.

News December 26, 2025

NLG: సీఎం ప్రకటన.. సర్పంచులకు ఊరట!

image

నిధులు లేక నీరసించిన పంచాయతీలకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నేరుగా సర్పంచ్‌లకే అందిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా చిన్న జీపీలకు రూ.5 లక్షలు, పెద్ద జీపీలకు రూ.10 లక్షలు అందిస్తామని సీఎం ప్రకటించడంతో సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,779 గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనున్నది.