News November 13, 2024

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ 

image

రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని పలువురికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్‌ సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 11, 2024

ఎంజి యూనివర్సిటీ బిఈడి రిజల్ట్స్

image

MG విశ్వవిద్యాలయం బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫలితాలను మంగళవారం యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాల వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2వ సెమిస్టర్‌లో 1813 మంది పాస్ కాగా, 692 మంది ప్రమోట్ అయ్యారు. 85 మంది డిటైన్డ్ అయినట్లు తెలిపారు. మొదటి సెమిస్టర్‌లో 299 మంది పాస్ కాగా 237 మంది ఫెయిల్ అయ్యారు.

News December 10, 2024

పుష్ప-2లో అల్లు అర్జున్‌ షర్ట్ మన పోచంపల్లిదే..

image

ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్నిచోట్ల క్యాస్టూమ్స్‌గా పోచంపల్లి వస్త్రాలు మెరిశాయి. పోలీస్‌ ఆఫీసర్‌ బన్వర్‌సింగ్‌ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివ..’ అని చెప్పే డైలాగ్‌లో హీరో అల్లు అర్జున్ ధరించినది పోచంపల్లి ఇక్కత్ చొక్కానే. పోచంపల్లిలో షూటింగ్ సమయంలో ఈ షర్ట్ కొన్నట్లు స్థానికులు తెలిపారు. 

News December 10, 2024

NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ

image

ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.