News February 4, 2025
BREAKING: నాగర్కర్నూల్లో దారుణం.. తల్లిని చంపేశాడు!

నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 19, 2025
శుభ సమయం (19-11-2025) బుధవారం

✒ తిథి: బహుళ చతుర్దశి ఉ.8.29 వరకు
✒ నక్షత్రం: స్వాతి ఉ.7.49 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ప.12.00-1.30 వరకు
✒ యమగండం: ఉ.7.30-9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24 వరకు
✒ వర్జ్యం: మ.2.01-3.47
✒ అమృత ఘడియలు: రా.12.43-2.29
News November 19, 2025
సకాలంలో లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

భూసేకరణ కేసుల్లో పూర్తి డేటా సిద్ధం చేసి, ప్రజాభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. రోడ్డు ప్రాజెక్టులు, రైల్వే మూడవ, నాలుగవ లైన్ భూసేకరణను వేగవంతం చేయాలని, పారిశ్రామిక పార్కుల్లో కొత్త యూనిట్ల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 19, 2025
పార్వతీపురంలో ఈనెల 28న ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్

ఈ నెల 28వ తేదీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గం.కు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. సమస్యలను ఈ గ్రీవెన్స్లో దరఖాస్తులను అందజేయవచ్చని పేర్కొన్నారు.


