News February 4, 2025
BREAKING: నాగర్‌కర్నూల్‌లో దారుణం.. తల్లిని చంపేశాడు!

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన యాదమ్మ కుమారుడు కరుణాకర్ మద్యంతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కోపంతో కన్నతల్లిని గోడకేసి కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2025
సిద్దిపేట: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 6మందికి జరిమానా

సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, రాజీవ్ రహదారిపై సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్నిరోజుల క్రితం వాహనాల తనిఖీ నిర్వహించారు. 6మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేశారు. మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా న్యాయమూర్తి కాంతారావు ముందు గురువారం హాజరుపరచగా 6 మందికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.
News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News February 14, 2025
వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.