News April 15, 2025
BREAKING.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.
Similar News
News December 24, 2025
నకిలీ నోట్ల కేసులో 8 మంది అరెస్ట్: వర్ని SI

వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామం కేంద్రంగా బయటపడ్డ దొంగ నోట్ల కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు వర్నిSI రాజు తెలిపారు. జలాల్పూర్ సర్పంచ్ మమత భర్త బాలుతో పాటు అతని తమ్ముడు నరేడ్ల శంకర్, అఫంధి ఫారానికి చెందిన పాల్త్య కళ్యాణ్, చందూర్ గ్రామానికి చెందిన సటోజీ గోపాల్, రమేష్, మహాదేవ్, ఇల్తేమ్ రవి, రవికుమార్ రెడ్డిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 9.86 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
News December 24, 2025
కశింకోట: స్కూల్‌లో జగన్ బర్త్ డే.. హెచ్ఎంకు షోకాజ్ నోటీస్

కసింకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈనెల 20న వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించినందుకు హెచ్ఎం స్వర్ణ కుమారికి డీఈఓ అప్పారావు నాయుడు షోకాస్ నోటీస్ జారీ చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఆమెకు షోకాస్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో మంగళవారం తెలిపారు. నోటీసుపై మూడు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇస్తే ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.
News December 24, 2025
అవినీతి జలగలు.. విశాఖలో అటెండర్ ఆస్తి తెలిస్తే షాక్!

నగరంలోని సూపర్ బజార్ సబ్ రిజిస్ట్రార్ మోహన్ రావు కార్యాలయంలో పాటు అటెండర్, జూనియర్ అసిస్టెంట్ ఇళ్ళపైనా నిన్న ఏసీబీ దాడులు చేసింది. మోహన్ రావు ఇంట్లో లెక్కకు మించి ఆస్తులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోగా అటెండర్ ఆనంద్ కుమార్ ఇంటిలో రూ.కోటి విలువైన ఆస్తుల్ని గుర్తించారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ సుధారాణి ఇంట్లో కూడా కోటి రూపాయలు పైబడి స్థిర, చరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.


