News October 16, 2024

BREAKING: నాగర్‌కర్నూల్: దంపతుల దారుణ హత్య

image

రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్‌లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 3, 2024

MBNR: పంజాబ్‌కు బయలుదేరిన PU తైక్వాండో జట్టు

image

పాలమూరు విశ్వవిద్యాలయ పురుషుల తైక్వాండో జట్టు ఆల్ ఇండియా లెవెల్లో పాల్గొనడానికి ఆదివారం పంజాబ్‌కు బయలుదేరింది. ఈ పోటీలు పంజాబ్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన క్రీడాకారులు గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్‌లలో నిర్వహించే ఆల్ ఇండియా పోటీల్లో పాల్గొంటారని PU PD డా.శ్రీనివాసులు తెలిపారు. 

News November 3, 2024

దేవరకద్ర: ఎట్టకేలకు 27వ దొంగతనానికి దొరికిపోయారు

image

ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో 26 సార్లు పశువుల దొంగతనానికి పాల్పడిన దొంగలు 27వ సారి దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లింగాల, నందికొట్కూర్, కోరుకొండ, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన పలువురు దొంగలు గత కొంతకాలంగా కల్వకుర్తి, దేవరకద్ర, తాండూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, భూత్పూర్ తదితర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు.

News November 3, 2024

MBNR: వినియోగదారులు తోడ్పాటు అందించాలి: SE రమేశ్ 

image

తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటర్ కమిషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మహబూబ్ నగర్ సర్కిల్ పరిధిలో 8, జడ్చర్ల డివిజన్ 23, దేవరకద్ర 3, రాజాపూర్ 3 ఫిర్యాదులు అందాయని SE రమేశ్ తెలిపారు. వాటి పరిష్కారానికి విద్యుత్తు అధికారులు సిబ్బంది ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు వినియోగదారులు సిబ్బందికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు.