News August 29, 2024

BREAKING: నాగిరెడ్డిపేట తహశీల్దార్ SUSPEND

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్‌ లక్ష్మణ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 15 రోజులుగా రైతులు MRO ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఎల్లారెడ్డి RDO మన్నే ప్రభాకర్ విచారణ జరిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని RDO తెలిపారు.

Similar News

News January 15, 2025

కామారెడ్డి:  చైనా మాంజా ఏం చేయలేదు

image

సంక్రాంతి పండగ సందర్భంగా ఎగరేసిన గాలిపటాల చైనా మాంజాలు ప్రజలకు తాకి జిల్లాలో పలువురి గొంతులు తెగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కామారెడ్డి పట్టణ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైక్‌లపై వెళ్లే వారు ప్రమాదాల బారిన పడకుండా ఐరన్ కేబుల్‌ని బండికి బిగిస్తున్నారు. దీంతో వారిని పలువురు అభినందిస్తున్నారు.

News January 15, 2025

డిచ్‌పల్లి: టీయూలో Ph.D అడ్మిషన్లకు నోటిఫికేషన్

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఫ్యాకల్టీ ఆఫ్ లా తదితర విభాగాల్లో కేటగరి-1 Ph.D అడ్మిషన్లకు సంబంధిత డీన్‌లు నోటిఫికేషన్‌లు జారీ చేశారు. యూజీసీ నెట్,CSIR నెట్ పరీక్షల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సంప్రదించాలన్నారు. 

News January 15, 2025

కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.