News February 20, 2025
BREAKING: నిజామాబాద్లో విషాదం.. ముగ్గురి మృతి

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. బోధన్ మండలం పెగడపల్లిలో కరెంట్ షాక్తో ముగ్గురు చనిపోయారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద చోరీ చేస్తుండగా వారికి షాక్ కొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్గా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
తంగళ్ళపల్లి: గుర్తుపడితే సమాచారం ఇవ్వాలి: ఎస్ఐ

మృతుడిని గుర్తుపడితే సమాచారం ఇవ్వాలని తంగళ్ళపల్లి ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు. తంగళ్ళపల్లిలోని మానేరువాగులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని శవం లభ్యమైందన్నారు. సుమారు అతని వయసు 40–50 సంవత్సరాలు ఉంటుదన్నారు. 5.3 ఫీట్ల ఎత్తు, కోలముఖం, బూడిద కలర్ పాయింట్, మెరూన్ కలర్ జర్కిని ధరించి ఉన్నాడన్నారు. మృతున్ని ఎవరైనా గుర్తుపడితే 8712656370 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
News November 16, 2025
WOW.. చీమ కాలుపైనున్న వెంట్రుకలను కూడా గుర్తించే లెన్స్!

జార్జియా టెక్ శాస్త్రవేత్తలు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే PHySL అనే విప్లవాత్మక సాఫ్ట్ రోబోటిక్ లెన్స్ను సృష్టించారు. చీమ కాలుపై వెంట్రుకలను కూడా గుర్తించగలిగే సామర్థ్యం దీనికుందని చెబుతున్నారు. 4 మైక్రోమీటర్ల వెడల్పున్న అతి చిన్న వస్తువులను సైతం దీంతో స్పష్టంగా చూడొచ్చంటున్నారు. సర్జికల్ రోబోట్లు, వైద్యం, వ్యవసాయంతో సహా అనేక రంగాలలో ఈ సాంకేతికత అద్భుతమైన మార్పులు తీసుకొస్తుందని తెలిపారు.
News November 16, 2025
పొద్దుతిరుగుడు విత్తనాలను ఇలా నాటితే మేలు

పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు బోదెలు చేసి విత్తనం నాటినట్లైతే నీటితడులు ఇవ్వడానికి, ఎరువులను వేయుటకు అనుకూలంగా ఉండటమే కాకుండా మొక్కకు పటుత్వం కూడా లభిస్తుంది. నేల స్వభావాన్ని బట్టి విత్తే దూరం నిర్ణయించాలి. తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ. మరియు మొక్కల మధ్య 20-25 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. బరువైన నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ. మరియు మొక్కల మధ్య 30 సెం.మీ. దూరంలో విత్తాలి.


