News April 14, 2025

BREAKING: పటాన్‌చెరు: రోకలిబండతో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

image

పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను రోకలిబండతో కొట్టి భర్త రమేష్ హతమార్చాడు. భార్య భర్తల మధ్య గొడవ జరగగా అడ్డువచ్చిన అత్త కవితపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. దీంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా..అత్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 23, 2025

ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

image

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.

News November 23, 2025

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమా?

image

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోవడం ఎలాంటి అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. వత్తి పూర్తిగా కాలిపోవడం, దీపం మధ్యలోనే ఆగిపోవడం అనేవి భౌతిక కారణాల వల్ల మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ‘వీటికి దైవిక దోషాలు, ఎలాంటి అశుభ కారణాలు లేవు. దీపం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ పరిణామాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. భయపడవలసిన అవసరం లేదు’ అని వివరిస్తున్నారు.

News November 23, 2025

57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఏనుగు

image

MPలోని పన్నా టైగర్ రిజర్వులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 57 ఏళ్ల అనార్కలి అనే ఏనుగు కవలలకు జన్మనివ్వడంతో అడవి సిబ్బంది, వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏనుగు ఒక్క పిల్లకే జన్మనిస్తుంది. కానీ పన్నా చరిత్రలో తొలిసారిగా 3 గంటల వ్యవధిలో 2 పిల్లలు పుట్టాయి. దీంతో ఈ టైగర్ రిజర్వులో ఏనుగుల సంఖ్య 21కు చేరింది. గత 39 ఏళ్లలో పన్నాలో ఈ ఏనుగు ఇప్పటివరకు ఆరు సార్లు ప్రసవించింది.