News March 14, 2025

BREAKING: పరిగి-కొడంగల్ రోడ్డులో యాక్సిడెంట్ 

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పరిగి పట్టణ సమీపంలోని కొడంగల్ వెళ్లే రోడ్డులో రైస్ మిల్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

పాడేరు: వినతులు స్వీకరించిన కలెక్టర్ దినేష్

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఎ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు పాల్గొన్నారు.

News November 21, 2025

వేములవాడ: ‘అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా పదోన్నతి కల్పించాలి’

image

అంగన్వాడీ ఆయాలుగా పనిచేస్తున్న అర్హత కలిగిన వారికి టీచర్లుగా పదోన్నతి కల్పించాలని AITUC జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, ప్రధాన కార్యదర్శి కడారి రాములు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. సీనియారిటీ, సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే పూర్తయిందని, రోజులు గడుస్తున్నప్పటికీ నియామకాలు చేపట్టడం లేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

News November 21, 2025

ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. పిండిమరతో బాంబుల తయారీ!

image

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో అరెస్టైన పుల్వామాకు చెందిన ముజమ్మిల్ షకీల్ గనై కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను బాంబుల తయారీకి పిండిమరతో కెమికల్స్‌ను తయారు చేసినట్లు NDTV పేర్కొంది. ఫరీదాబాద్‌లోని తన రూమ్‌ను ఇందుకు వాడుకున్నాడని తెలిసింది. NOV 9న పోలీసులు ఇతని రూమ్‌లో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియాని పిండిమరలో వేసి అమ్మోనియం నైట్రేట్ తయారు చేసినట్లు సమాచారం.