News June 5, 2024

BREAKING.. ప్రారంభమైన MLC ఓట్ల లెక్కింపు

image

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రాధాన్యత ప్రారంభమైంది. ఒక్కో రౌండ్‌లో 96 టేబుళ్లపై 96 వేల ఓట్లు లెక్కించనున్నారు. కాగా, తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 4రౌండ్ల‌లో పూర్తి కానుంది. మొత్తం 3,36,013 ఓట్లు పోలవ్వగా.. అందులో 2139 ఓట్లు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లున్నాయి. అర్ధరాత్రిలోపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

Similar News

News December 8, 2025

ఖమ్మం: అవినీతి ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్: కలెక్టర్

image

అవినీతి నిరోధక శాఖ (ACB) వారోత్సవాల సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ACB పోస్టర్‌ను విడుదల చేశారు. అవినీతిపై ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064 తో పాటు, వాట్సాప్, ఈమెయిల్ మరియు ACB ఖమ్మం DSP నంబర్ (9154388981) ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

News December 8, 2025

ఖమ్మం: మద్యం దుకాణాలు బంద్

image

డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. డిసెంబర్ 11 న జరిగే ఎన్నికలకు డిసెంబర్ 9న సాయంత్రం 5:00 గంటల నుంచి డిసెంబర్ 11న ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలల్లో మద్యం విక్రయాలను నిలిపివేయాలన్నారు.

News December 8, 2025

మద్యం విక్రయాలపై కఠిన నిషేధం: సీపీ సునీల్ దత్

image

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మండలాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగే మూడు విడతల పోలింగ్‌కు ముందు రెండు రోజులు సాయంత్రం 5 గంటల నుంచి, పోలింగ్ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు.