News May 27, 2024

BREAKING: బాసర IIITలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

image

నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.

Similar News

News February 12, 2025

NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO

image

నిజామాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.

News February 12, 2025

NZB: యాక్సిడెంట్‌లో వ్యక్తి మృతి

image

వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ రమేశ్ పేర్కొన్నారు.

News February 12, 2025

NZB: రాహుల్ పర్యటన రద్దుపై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

image

వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేశారని విమర్శించారు. వరంగల్ డిక్లరేషన్‌పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ భయపడ్డారన్నారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోరని, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

error: Content is protected !!