News March 21, 2025

BREAKING: బీబీనగర్ తహశీల్దార్ సస్పెండ్

image

బీబీనగర్ తహశీల్దార్‌పై సస్పన్షన్ వేటు పడింది. పడమటిసోమారం గ్రామంలో ఖాళీ స్థలానికి  క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ జారీ చేయడంతో తహశీల్దార్ శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 7, 2025

NZB జిల్లాలో రేపటి నుంచి 163 సెక్షన్

image

TGPSC నిర్వహిస్తున్న డిపార్ట్‌మెంట్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా పరిధిలోని పరీక్షా కేంద్రాల వద్ద రేపటి నుంచి 14వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163ను అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రం వద్ద తిరగవద్దని ఆయన సూచించారు.

News November 7, 2025

సచివాలయాల పేరును మార్చలేదు: CMO

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.

News November 7, 2025

ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్‌సైట్: https://www.iitb.ac.in/