News March 21, 2025
BREAKING: బీబీనగర్ తహశీల్దార్ సస్పెండ్

బీబీనగర్ తహశీల్దార్‌పై సస్పన్షన్ వేటు పడింది. పడమటిసోమారం గ్రామంలో ఖాళీ స్థలానికి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా పాసుబుక్ జారీ చేయడంతో తహశీల్దార్ శ్రీధర్‌ను సస్పెండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ అధికారులు విధులపట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 20, 2025
‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్‌లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో దిలీప్ రాజా మాట్లాడుతూ త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.
News April 20, 2025
భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.
News April 20, 2025
DSC: అనంతపురం జిల్లాలో పోస్టులు ఇలా..

అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులను <<16155926>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 37
➤ హిందీ: 28 ➤ ఇంగ్లీష్: 103
➤ గణితం: 43 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 72 ➤ సోషల్: 111
➤ పీఈటీ: 145 ➤ఎస్జీటీ: 202 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్జీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.