News December 24, 2024
BREAKING: బొల్లాపల్లి: కాలువలో దూకిన జంట

బొల్లాపల్లి మండలంలో జంట సాగర్ కెనాల్లో దూకడం సంచలనంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో గల సాగర్ కెనాల్లో మంగళవారం ఓ జంట దూకారు. గమనించిన స్థానికులు వెంటనే కాలువలో దూకిన వారి కోసం రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మహిళను రక్షించారు. చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
మంగళగిరి: భార్యను హత్య చేసిన భర్త

మంగళగిరి పరిధి యర్రబాలెంలో వివాహిత హత్యకు గురైంది. CI బ్రహ్మం, SI వెంకట్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. వారి వివరాల మేరకు.. మచిలీపట్నంకు చెందిన కిలిమి లక్ష్మీ (29) 5 ఏళ్ళ క్రితం శంకర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కలహాలతో విడిపోయి, చినకాకానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తూ యర్రబాలెంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త శంకర్ రెడ్డి గొంతునులిమి హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
News November 18, 2025
ANU: LLB రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన LLB రీవాల్యుయేషన్ ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. LLB VI, X సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.