News February 19, 2025

BREAKING: భద్రాచలంలో చైన్‌స్నాచింగ్ 

image

భద్రాచలం పట్టణంలోని ఇందిరా మార్కెట్ రోడ్డులో గల కిరాణా దుకాణంలో బుధవారం వాటర్ బాటిల్ కొనడానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు షాప్ యజమానురాలి మెడలో నుంచి సుమారు 7 తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు. వెంటనే బాధితులు 100కు డయల్ తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News March 19, 2025

టేకుమట్ల: రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

image

టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన సొల్లేటి రాములు ప్రమాదవశాత్తు గతేడాది వాగులో పడి మృతి చెందాడు. కాగా పోస్ట్ ఆఫీసులో ప్రమాద బీమా చేయించుకున్న రాములు కుటుంబ సభ్యులకు మంగళవారం పోస్టల్ సూపరింటెండెంట్ హనుమంతు, రామకృష్ణ, స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంపీడీవో అనిత, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీశ్ చేతుల మీదుగా రూ.10 లక్షల బీమా చెక్కును అందజేశారు. బీమాతో కుటుంబం ధీమాగా ఉంటుందన్నారు.

News March 19, 2025

MBNR: CMకు ‘THANK YOU’ తెలిపిన ఎమ్మెల్యేలు

image

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిఅవకాశాలను పెంచేందుకు రూ.6000 కోట్ల రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. MLAలు మధుసూదన్ రెడ్డి, పర్నికా రెడ్డి, మేఘారెడ్డి, ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.

News March 19, 2025

జగిత్యాల: పట్టాల రద్దు.. స్వచ్ఛందంగా భూములు అప్పగించిన రైతులు

image

జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్‌లో అసైన్డ్ భూముల వ్యవహారంలో 13 ఎకరాల 21 గుంటల అక్రమ పట్టాలను రద్దు చేశారు. 90 ఎకరాలకు పైగా భూమి చట్ట విరుద్ధంగా పట్టా పొందినట్లు తహశీల్దార్ నివేదికలో వెల్లడైంది. దీంతో కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో 15 మందికి నోటీసులు ఇచ్చారు. 13.21 ఎకరాలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. ముగ్గురు రైతులు స్వచ్ఛందంగా 3.15 ఎకరాలను అప్పగించారు.

error: Content is protected !!