News February 26, 2026

BREAKING: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ బదిలీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను నియమించారు. కాగా భద్రాద్రి జిల్లాకు నూతన కలెక్టర్‌గా నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న అంకిత్‌ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.

Similar News

News April 15, 2026

WGL: ఆరు స్థానాలు పెరగడం పక్కా!

image

ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 6 కొత్తవి రావడం పక్కాగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 35,12,576 మంది కాగా, 17,59,772 పురుషులు, 17,53,295 మహిళలున్నారు. ప్రస్తుతం 12 నియోజకవర్గాలుండగా, కొత్తవి 6 రాబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉన్న 12 స్థానాల్లోని జనరల్ స్థానాలన్నీ మహిళలకు, రిజర్వు స్థానాలు జనరల్‌గా మారడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నేతలు వాటిపై గురి పెడుతున్నారు.

News April 15, 2026

ఖమ్మం: కళ తప్పిన జంట నగరాలు

image

వేలాది కార్మికులతో కళకళలాడిన కొత్తగూడెం, పాల్వంచ నగరాలు నేడు కళావిహీనంగా మారాయి. సింగరేణి గనుల మూత, కేటీపీఎస్‌ పాతప్లాంటు తొలగింపుతో కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీని ప్రభావం వర్తక, రియల్ ఎస్టేట్ రంగాలపై పడి వ్యాపారాలు కుదేలయ్యాయి. కార్పొరేషన్‌గా ఏర్పడినా అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో స్థానికులు వాపోతున్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News April 15, 2026

నల్గొండ: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

హాలియాలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టురట్టు చేశారు. ఒక నివాస గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.