News November 9, 2024

BREAKING: భూపాలపల్లి జిల్లాలో హత్య

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మర్డర్ కలకలం రేపింది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్రంపేట గ్రామంలో సకినాల సరస్వతి(48) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు చంపేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News December 13, 2024

ములుగు జిల్లాలోనే పెద్దపులి సంచారం!

image

ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి బుధవారం పెద్దపులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఉదయం తాడ్వాయి మండలం పంబాపూర్ సమీప అడవుల్లో పెద్దపులి పాదముద్రల గుర్తించామని రేంజర్ కోట సత్తయ్య తెలిపారు. ఓ వాగు వద్ద సంచరించినట్లు తెలిపారు. ఆ తర్వాత పాదముద్రలు కనపడలేదన్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News December 13, 2024

సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి కొండా

image

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా పర్యాటక భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తారామతి బారాధారిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు మంత్రి కొండా సురేఖ హాజరై కార్యక్రమాలను తిలకించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

News December 12, 2024

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషన్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.