News May 11, 2024

BREAKING: మంచిర్యాల.. ముగిసిన ప్రచారం

image

మంచిర్యాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముగించారు. గత కొన్నిరోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కష్టపడుతూ.. ఓటును అభ్యర్థించారు. కొన్ని రోజులుగా మైకులతో మార్మోగిన ఈ ప్రాంతాలు ఈ సాయంత్రం 4 తర్వాత మైకులు మూగబోయాయి. కాగా ఈ నెల 13 ఓటింగ్ జరగనుండగా..వచ్చే నెల 4న వారి భవితవ్యం తేలనుంది.

Similar News

News November 3, 2025

ADB: మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

image

ఆదిలాబాద్ జిల్లాలో మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజార్షిషా ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం ఆరు దుకాణాల కేటాయింపులు ఈ కార్యక్రమంలో పూర్తయ్యాయి. ఎక్సైజ్ పాలసీ–2025–27 ప్రకారం షాపులకు టోకెన్ నంబర్లు కేటాయించి, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా లక్కీ డ్రా నిర్వహించారు. ప్రక్రియ మొత్తం ఫోటో, వీడియో రికార్డింగ్‌తో పూర్తి పారదర్శకంగా సాగింది.

News November 3, 2025

జూడో పోటీల్లో అదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ

image

హనుమకొండ వేదికగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్ 17 ఎస్జీఎఫ్ఐ జూడో పోటీల్లో జిల్లా క్రీడా పాఠశాలకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. ఏకంగా 12 పతకాలతో మెరిశారు. బాలికల విభాగంలో నాగిని ప్రియ, సహస్ర, సింధు, అక్షిత, ప్రణీత, శృతిలు విజేతలుగా నిలవగా, బాలుర విభాగంలో మనోజ్, తరుణ్, హర్షవర్ధన్, లోకేష్, మధు, సంతోష్ అనే క్రీడాకారులు సత్తా చాటారనీ జూడో కోచ్ రాజు తెలిపారు.

News November 2, 2025

ADB: ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరి: సలోని చాబ్రా

image

వయోవృద్ధులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలని ట్రైనీ కలెక్టర్‌సలోని చాబ్రా అన్నారు. పట్టణంలోని జిల్లా వయోవృద్ధుల సమాఖ్య కార్యాలయంలో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, పర్యవేక్షణతో ఉండి వారికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు.