News May 11, 2024
BREAKING: మంచిర్యాల.. ముగిసిన ప్రచారం

మంచిర్యాల జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రచారం ముగిసింది. చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముగించారు. గత కొన్నిరోజులుగా ఓటర్లను ప్రసన్నం చేసేందుకు కష్టపడుతూ.. ఓటును అభ్యర్థించారు. కొన్ని రోజులుగా మైకులతో మార్మోగిన ఈ ప్రాంతాలు ఈ సాయంత్రం 4 తర్వాత మైకులు మూగబోయాయి. కాగా ఈ నెల 13 ఓటింగ్ జరగనుండగా..వచ్చే నెల 4న వారి భవితవ్యం తేలనుంది.
Similar News
News December 16, 2025
అ పంచాయితీ కి 19 ఏళ్లుగా సర్పంచ్ లేడు.. అది ఎక్కడంటే

జిల్లాలో ఆ పంచాయతీ ది, అందులో 5 వార్డుల విచిత్రమైన పరిస్థితి. ఆ పంచాయతీ పరిధిలో ఒక్కరు కూడ ఎస్టీ తెగకు చెందిన వాళ్ళు లేకున్నా ఆ పంచాయతీ మాత్రం 19 ఏళ్లుగా ఎస్టీ గానే రిజర్వేషన్ కొనసాగుతూ వస్తుంది. దీంతో ఆ పంచాయతీకి సర్పంచ్ లేక ఉప సర్పంచే సర్పంచ్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఈ విచిత్రమైన పంచాయతీ తలమడుగు మండలంలోని రుయ్యాడి పరిస్థితి. దీంతో 19 ఏళ్లుగా సర్పంచ్, 5 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు.
News December 15, 2025
102 మంది సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపర్చిన వారే: నరేష్ జాదవ్

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నదని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మొత్తం 156 గ్రామ పంచాయతీ స్థానాల్లో 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని, దీంతో ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News December 15, 2025
వందశాతం పోలింగ్ లక్ష్యం: ADB కలెక్టర్

మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో 100శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఎన్నికల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామాల్లో వందశాతం పోలింగ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు.


