News November 3, 2024

BREAKING: మణుగూరులో విషాదం.. విద్యుత్ ఘాతంతో ఇద్దరు మృతి

image

మణుగూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హై స్కూల్లో కరెంట్ షాక్‌తో ఇద్దరు వాచ్‌మెన్లు మృతి చెందారు. ఈరోజు ఉ.5.30కు పాఠశాల ఆవరణలో ఉన్న విద్యుత్ మెయిన్ తీగలకు పాఠశాలలో ఉన్న ఇనుప స్తంభం తీస్తుంగా.. విద్యుత్ తీగలకు తగలడంతో మణుగూరుకు చెందిన ఉపేందర్, రత్నం వాచ్‌మెన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి మృతితో దుఃఖసాగరంలో మునిగారు.

Similar News

News November 18, 2025

రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

image

పేరెంట్-టీచర్స్ మీటింగ్‌ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

image

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.