News July 1, 2024

BREAKING.. మహబూబాబాద్‌లో పురుగు మందు తాగిన SI

image

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాములు(34) MHBD జిల్లా కేంద్రంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. WGL జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా SIగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా విషయం బయటపడింది. వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 22, 2025

హనుమకొండలో ధాన్యం అక్రమాలు

image

HNK జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నారు. వీవోఏ బలభద్ర హైమావతి, అల్లె అనితలు మిల్లర్‌తో కలసి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడ్డాయి. ఈ కేసులో 21 మందిపై శాయంపేట స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వీవోఏలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శాఖా చర్యలతో విధుల నుంచి తొలగించి, సీసీలకు నోటీసులు ఇచ్చారు.

News October 22, 2025

వరంగల్‌లో నకిలీ ఏసీబీ మోసం

image

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.

News October 22, 2025

వరంగల్: ప్లాస్టిక్ సంచుల్లో పత్తి నిల్వ చేయొద్దు

image

పంట చేలలో పత్తి ఏరిన రైతులు ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసి అనంతరం కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారని, ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేయడం ద్వారా సంచుల దారాలు పత్తిలో ఇరుక్కుపోయి నాణ్యత తగ్గిపోతుందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. పత్తి ఏరిన సమయంలో బట్ట సంచులు లేదా చీరల్లో పత్తిని నిల్వ చేయాలని సూచించారు. సంచిలో పత్తి ఎక్కువ పట్టాలని కుక్కి తీసుకు వస్తారని, అలా కూడా చేయకూడదన్నారు.