News April 14, 2025

BREAKING: మహబూబ్‌నగర్‌లో తీవ్ర విషాదం

image

మహబూబ్‌నగర్‌లో ఈరోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద క్వారీ గుంతలో ఈతకు దిగిన ముగ్గురు యువకులు నీట మునిగారు. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువకులు మునిగిపోతుండగా వాళ్లని కాపాడబోయి మరో యువకుడు కూడా మునిగిపోయాడు.

Similar News

News November 23, 2025

కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

News November 23, 2025

స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

image

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై విచారణకు హాజరుకావాలన్న స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు నేటితో గడువు ముగియనుండటంతో మరి కొంత సమయం కావాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ రాశారు. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు, తాజా పరిస్థితులపై కాంగ్రెస్ నేతలను ఆయన కలిసి చర్చించినట్లు సమాచారం.

News November 23, 2025

బహ్రెయిన్- HYD విమానానికి బాంబు బెదిరింపు కాల్

image

బహ్రెయిన్- HYD GF 274 విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అలర్ట్ అయ్యి శంషాబాద్‌కు రావాల్సిన విమానాన్ని ముంబైకి డైవర్ట్ చేశారు. తెల్లవారుజామున 4:20కి ఫ్లైట్ అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అయింది. విమానం అంతటా CISF, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనూ అలర్ట్ చేయగా ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.