News February 6, 2025

BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.

Similar News

News November 16, 2025

గోపాల్‌పేటకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

image

వనపర్తి సంస్థానంలో భాగంగా 1711లో గోపాల్‌పేట సంస్థానం ఏర్పడింది. చరిత్ర ప్రకారం.. వనపర్తి, గోపాల్‌పేట ఉమ్మడి ప్రాంతాలను పూర్వం పానుగంటి సీమ అని పిలిచేవారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థానానికి, వనపర్తి, గోపాల్‌పేట సంస్థానాల మూలపురుషుడు జనంపల్లి వీరకృష్ణారెడ్డి పెద్ద కుమారుడైన వెంకటరెడ్డి గోపాలరావు పేరు మీదగా గోపాల్‌పేట అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News November 16, 2025

కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

image

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News November 16, 2025

వనపర్తి: న్యాయ సాధన దీక్ష చేపట్టిన బీసీలు

image

బీసీ రిజర్వేషన్లు ఎవరో ఇచ్చే బిక్ష కాదని ఇది బీసీల హక్కని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ముకుంద నాయుడు అన్నారు. పట్టణంలోని మర్రికుంట ధర్నాచౌక్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం, BC JAC ఆధ్వర్యంలో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యుల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.