News February 6, 2025
BREAKING: మహబూబ్నగర్ జిల్లాలో MURDER

మహబూబ్నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News October 24, 2025
నరసరావుపేట: సీసీఆర్ నిధులపై వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్ కృతికా శుక్లా సామాజిక ఆరోగ్య కేంద్రం, మాచర్లకు సి.ఎస్.ఆర్. నిధుల ద్వారా కొనుగోలు చేయాల్సిన ఆసుపత్రి పరికరాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పవర్ గ్రిడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అవసరమైన పరికరాలను జిల్లా పర్చేస్ కమిటీ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.
News October 24, 2025
రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు: ఎస్పీ మాధవరెడ్డి

భామిని మండలం బత్తిలి పోలీస్ స్టేషన్లో పార్వతీపురం ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రహదారి ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. కంప్యూటర్ సిబ్బంది కేసు ప్రాపర్టీ గదులను తనిఖీ చేసి భద్రతపై పలు సూచనలు అందించారు. కేసులు వివరాలు, దర్యాప్తు పెండింగ్ కేసులు పూర్తి చేయాలని సూచించారు.
News October 24, 2025
ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన కలెక్టర్

విదేశీ విద్యా విధానం ఆధ్యయానికి దరఖాస్తులు చేసుకున్న ఉపాధ్యాయులకు శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని ఉపాధ్యాయులను విదేశీ విద్యా విధానాలు పరిశీలించేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కార్యక్రమం చేపడుతున్నామన్నారు.


