News February 6, 2025
BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
Similar News
News March 19, 2025
మహబూబ్‌నగర్: నందిని మృతి.. ఆర్థిక సాయం

పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఇటీవల కామెర్లు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ మృతిచెందింది. దీంతో పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. వీసీ మాట్లాడుతూ.. నందిని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News March 19, 2025
MBNR: TG ఖోఖో జట్టులో ఎంపికైన పీడి

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS
News March 19, 2025
తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.