News March 28, 2025
BREAKING: మహబూబ్‌నగర్: విద్యార్థి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పీర్ల గుట్ట సమీపంలో ఉండే మణిదీప్(18) ఉదయం పేపర్ బాయ్‌గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 5, 2025
బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా వేముల ప్రమాణస్వీకారం

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడిగా వేముల నరేందర్‌రావు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు జిల్లా అంతటా పార్టీని బలోపేతం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దిలీప్ ఆచారి, సుధాకర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
News April 5, 2025
కన్నులపండుగగా సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

శ్రీరామనవమికి భద్రాద్రి రామయ్య దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో జరుగుతున్న తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కళ్యాణ మహోత్సవానికి ఒక రోజు ముందు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా జరుగుతోంది.
News April 5, 2025
ఏఐ ప్రజాస్వామ్యానికే పెను సవాల్ విసిరింది: సీఎం రేవంత్

TG: కంచ గచ్చిబౌలి వ్యవహారంలో AIని ఉపయోగించి వివాదం సృష్టించారని CM రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIతో నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించారు. వాటినే సెలబ్రిటీలు రీపోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశం పంపారు. ఈ వివాదం ప్రజాస్వామ్యానికే పెను సవాలు విసిరింది. దేశ సరిహద్దుల్లో ఘర్షణ జరుగుతోందంటూ ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది’ అని అన్నారు.