News November 18, 2024

BREAKING.. మియపూర్‌లో బాలిక మిస్సింగ్.. తుక్కుగూడలో డెడ్‌బాడీ

image

HYDలో విషాదం నెలకొంది. ఈనెల 8న మియపూర్‌లో అదృశ్యమైన బాలిక(17) తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసరాల్లో శవమై కనిపించింది. పోలీసుల వివరాలు.. ఈనెల 8న బాలిక అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతురాలికి ఉప్పుగూడకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అతడిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 13, 2026

HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

image

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

News March 13, 2026

HYD: టిఫిన్‌పై ₹20, చాయ్‌పై ₹5 ఎక్స్‌ట్రా

image

గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్‌లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద ₹20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. ₹40 ఉండే టిఫిన్‌పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా చాయ్ మీద ₹5 పెంచినట్లు నిర్వాహకుల చెబుతుండటం ధరల పెరుగుదల తీవ్రతను తెలియజేస్తోంది. చాలా చోట్ల టిఫిన్ సెంటర్లు మూసేశారు. మీ ఏరియాలోనూ ధరలు పెంచారా?

News March 13, 2026

HYD: ఫ్యాన్సీ నంబర్లతో భారీగా ఆదాయం

image

ఖైరతాబాద్ RTA కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకొనేందుకే వాహనదారులు పోటీ పడ్డారు. TG 09 L 0009ను రూ.10,50,000కు, TG 09 L 0007కు రూ.3,19,999, TG 09 L 0005ను రూ.2,00,005కు, TG 09 K 9999ను రూ.1.5 లక్షలకు, TG 09 L 0024ను రూ.1.24 లక్షలకు, TG 09 L 0001ను రూ.లక్షకు దక్కించుకున్నారు. ఈ నంబర్లతో RTA ఆఫీస్‌కు రూ.31,14,730 ఆదాయం వచ్చింది.