News September 27, 2024
BREAKING: ములుగు జిల్లాలో అటవీ అధికారులపై దాడి

ములుగు జిల్లాలో దారుణం జరిగింది. తాడ్వాయి రేంజ్ పరిధి దమరవాయి అటవీ ప్రాంతంలో కొందరు అక్రమంగా చెట్లను నరికి వేస్తుండగా అటవీశాఖ అధికారులు వినోద్, శరత్ చంద్ర, సుమన్ అడ్డుకున్నారు. దీంతో వారిపై JCB ఓనర్ సూరజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశాడని అటవీ అధికారులు చెప్పారు. వారి వాహనాలు ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అటవీ అధికారులు చెప్పారు.
Similar News
News November 27, 2025
వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
News November 27, 2025
Te-Poll యాప్ను డౌన్లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.
News November 27, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.


