News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 2, 2025

పొలాల్లో మద్యం సీసాలు వేయొద్దు: ఎస్పీ నరసింహ

image

మద్యం తాగి ఖాళీ సీసాలను కాలువలు, పంట పొలాల్లో వేయడం వల్ల పొలం పనులు చేసే రైతులకు, కూలీలకు గాయాలవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్పీ నర్సింహ తెలిపారు. బహిరంగంగా మద్యం సేవించడం, ఖాళీ సీసాలను పంట పొలాల్లో పడవేయడం మంచి లక్షణం కాదని సూచించారు. పాఠశాలల పరిసరాల్లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News December 2, 2025

సంగారెడ్డి: రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ

image

జిల్లాలోని 17 మండలాల్లో ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం తెలిపారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 234 గ్రామపంచాయతీలు, 1960 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News December 2, 2025

EPS-95 పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

image

EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్‌‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని తెలిపింది. అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు. MP సురేశ్ గోపీనాథ్ మాత్రే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ సమాధానమిచ్చారు. ఈ స్కీమ్ కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.