News February 11, 2025

BREAKING.. ములుగు: పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య

image

ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో పురుగు మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆలెం స్వామి, అశ్విత మృతి చెందారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 7, 2025

SVUలో అధిక ఫీజులు.. అయినా.!

image

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MBA, MCA, PG సెమిస్టర్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతర యూనివర్సిటీల్లో రూ.1500లోపు సెమిస్టర్ ఫీజులు ఉండగా.. SVUలో మాత్రం రూ.4వేల వరకు ఉందట. ఇంత ఫీజులు కడుతున్నా సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడం లేదంటూ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

image

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.

News December 7, 2025

SRPT: పోస్టల్ బ్యాలెట్ విధిగా వినియోగించుకోవాలి: కలెక్టర్

image

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను విధిగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేట సహా 8 మండలాల ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.