News January 17, 2025

BREAKING.. మెదక్: కొడుకును నరికి చంపిన తండ్రి

image

వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(30) మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ పడటంతో పడుకున్న శ్రీకాంత్‌ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.

Similar News

News December 8, 2025

మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

image

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

News December 8, 2025

మెదక్: రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ: ఎస్పీ

image

CEIR పోర్టల్ ద్వారా రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోగొట్టుకున్న 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని వివరించారు. కోల్పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.

News December 8, 2025

కుకుట్లపల్లిలో అన్నదమ్ముల మధ్య సవాల్

image

కౌడిపల్లి మండలంలో కూకట్లపల్లి పంచాయతీలో సొంత అన్నదమ్ముల మధ్య పోరు జరుగుతోంది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుదారుగా నీరుడి అశోక్ బరిలో నిలవగా అతని తమ్ముడు నీరుడి కుమార్ భారాస మద్దతుతో పోటీలో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు వారికి మద్దతు తెలపడంతో అన్నాదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి మరి.