News November 18, 2024

BREAKING: మేడారంలో విచిత్ర పూజలు

image

ములుగు జిల్లా మేడారం సమ్మక్క తల్లి కొలువైన చిలుకలగుట్ట చుట్టూ విచిత్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం వస్తే అర్ధరాత్రి వేళలో ముగ్గులు వేసి, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, వివిధ రకాల వస్తువులతో పూజలు నిర్వహిస్తున్నారని స్థానిక పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిలకలగుట్ట చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Similar News

News December 10, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,800 పలకగా.. మంగళవారం రూ.15,500 పలికింది. అలాగే 341 రకం మిర్చికి గత సోమవారం రూ.14,000 పలకగా నేడు రూ. 13,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్నటిలాగే రూ.14,000 ధర వచ్చింది.

News December 10, 2024

పార్లమెంట్ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న MHBD ఎంపీ

image

అదాని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు నిర్వహించిన ధర్నాలో MHBD ఎంపీ కోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం అదాని లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.

News December 10, 2024

వరంగల్: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్‌లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.