News August 31, 2024
BREAKING: మేడ్చల్ నాదం చెరువు తూము ధ్వంసం చేసిన దుండగులు

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని వెంకటాపూర్ నాదం చెరువు తూమును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో చెరువు నీళ్లు దిగువకు పోటెత్తాయి. నాదం చెరువు బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్టుపై ఇటీవల పోచారం పీఎస్‌లో కేసు నమోదైంది. దుండగులపై చర్యలు తీసుకోవాలని ఏఈఈకి ఫిర్యాదు చేశారు.
Similar News
News February 15, 2025
HYD: వాటిని గుర్తిస్తే ఫిర్యాదు చేయండి: డీజీ

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్రమంగా మెడిసిన్ నిల్వలు, తయారీ, విక్రయాలు జరిగితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని డీజీ డీకే కమలాసన్ రెడ్డి సూచించారు. 18005996969కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డ్రగ్స్ సంబంధిత సమాచారం అందినా తమకు తెలియజేయాలని సూచించారు.
News February 15, 2025
మీర్పేట్: అధ్యక్షురాలికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ ప్రశాంతి హిల్స్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ జాగృతి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు మిర్యాల పావనిని ఇవాళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమెను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవల కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
News February 15, 2025
HYD: ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటండి: ఎంపీ

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వృక్షార్చన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.