News February 23, 2025
BREAKING: మైనర్లపై పెట్రో దాడి.. గాయాలు

పేట్ బషీరాబాద్ PS పరిధిలో దారుణం జరిగింది. జై రామ్ నగర్‌లోని నిర్మాణుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు ఐదుగురు మైనర్లు (ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు బాలికలు) వెళ్లారు. ఇద్దరు అమ్మాయిలపై జరిగిన పెట్రోల్ దాడిలో ఒక బాలిక(10)కు తీవ్ర గాయలు, మరో బాలిక(9)కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైనర్‌లకు పెట్రోల్ డబ్బా, అగ్గిపెట్టే ఎక్కడి నుంచి వచ్చాయన్నది మిస్టరీగా మిగిలింది.
Similar News
News March 19, 2025
HYD గురించి చెప్పాలనుకుంటున్నారా?

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మొదలైంది. దేశంలోని వివిధ నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డులు అందజేస్తోంది. ఈ సర్వేలో ప్రజలు పాల్గొని తమ నగరం గురించి అభిప్రాయాలు చెప్పవచ్చు. https ://sbmurban.org/feedback వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనేందుకు ఈనెల 31 వరకు మాత్రమే అవకాశం. ఇప్పటికే దాదాపు 14వేల మంది నగరవాసులు సర్వేలో పాల్గొన్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరు కూడా పాల్గొనండి.
News March 19, 2025
ఓయూ లా కోర్సుల పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్, ఐదేళ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకాం ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎల్ఎల్ఎం మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
News March 18, 2025
ఈడీ వద్దకు చేరిన బెట్టింగ్ యాప్స్ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వివరాలపై ఈడీ ఆరా తీసింది. చెల్లింపుల వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకుంది. హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. 11 మంది వివరాలు సేకరించి.. ఎవరెవరికి ఎంత డబ్బులు ముట్టాయని ఈడీ ఆరా తీస్తోంది.