News August 13, 2024

BREAKING: రాయలసీమ రేంజ్‌లో భారీగా సీఐల బదిలీ

image

రాయలసీమ రేంజ్ పరిధిలో ఒకేసారి 62మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 18 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా మరోవైపు ఇప్పటికే వీఆర్‌లో ఉన్న 15 సీఐలకు పోస్టింగ్ లభించింది. ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఐలను డీఐజీ డా.కోయ ప్రవీణ్ నియమించారు.

Similar News

News November 28, 2025

ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

image

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్‌క్వార్టర్‌గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్‌క్వార్టర్‌గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.

News November 28, 2025

ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.