News February 25, 2026
BREAKING: రూ.5వేలు పెరిగిన కేజీ సిల్వర్ రేటు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.110 పెరిగి రూ.1,61,890కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.100 ఎగబాకి రూ.1,48,400 పలుకుతోంది. అటు వెండి ధర కేజీపై రూ.5వేలు పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
Similar News
News April 16, 2026
రూ. 74.2 కోట్లతో కాలువలు, రోడ్ల అభివృద్ధి: కలెక్టర్

ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మరమ్మతులు, ఆధునీకరణ, రావులపాలెం-బొబ్బర్లంక రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం ₹74.2 కోట్లు కేటాయించింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి. ప్రస్తుతం డిజైన్ ప్రతిపాదనలు చీఫ్ ఇంజినీర్ పరిశీలనలో ఉన్నాయని, అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు.
News April 16, 2026
పంత్ ఆడటం కష్టమే: మాజీ క్రికెటర్

RCBతో జరిగిన మ్యాచులో LSG కెప్టెన్ పంత్ ఎడమ మోచేతికి బంతి తగిలి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా సీజన్‌లో మిగిలిన మ్యాచులకు పంత్ అందుబాటులో ఉండకపోవచ్చని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. ‘LSG చాలా దారుణమైన జట్టు. వాళ్ల బౌలింగ్ మాత్రమే కాస్త బాగుంది. 5 మ్యాచులు పూర్తయినా బ్యాటింగ్‌లో రాణించేలా కనిపించట్లేదు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పుకొచ్చారు.
News April 16, 2026
రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు నా దగ్గర టైమ్ లేదు: మృణాల్

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు ప్రస్తుతం తన వద్ద టైమ్ లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ‘ఈమధ్య నా కాలుకు దెబ్బ తగిలింది. బిజీ షెడ్యూల్ వల్ల ట్రీట్‌మెంట్ చేయించుకోలేకపోయాను. అలాంటిది రిలేషన్‌షిప్‌కు నా దగ్గర టైమ్ ఎక్కడ ఉంటుంది. ఎవరితో డేటింగ్ చేస్తున్నానన్న దానికంటే నేను చేసే పని వల్లే నాకు గుర్తింపు రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


