News March 6, 2025

BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

image

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2026

ఆనందపురంలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే

image

ఆనందపురం మండలంలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కేజీ రూ.950-1000 ఉండగా.. చికెన్ (స్కిన్ లెస్) కేజీ రూ.300గా ఉంది. విత్ స్కిన్ కేజీ రూ.280 చొప్పున విక్రయిస్తున్నారు. శొంఠ్యాం కోడి కేజీ రూ.310గా ఉంది. అలాగే డజన్ గుడ్లు రూ.90కి కొనుగోలు చేస్తున్నారు. గత వారంతో పోల్చుకుంటే దాదాపు అన్ని రేట్లు కాస్త పెరిగాయని వినియోగదారులు తెలిపారు.

News January 11, 2026

పండగపూట ప్రయాణ కష్టాలు.. రెండేళ్లు దాటినా తీరని అగచాట్లు!

image

సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రహదారి కష్టాలు తప్పడం లేదు. HYD, NLG నుంచి APకి వెళ్లే వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, ప్రధాన రహదారుల మరమ్మతులను గాలికి వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండగ పూట ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ఇప్పటికైనా సర్కారు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

News January 11, 2026

శ్రీ సత్యసాయి: పండుగ పూట విషాదాంతం

image

పండుగ పూట పలు కుటుంబాల్లో విషాదం నిండింది. హిందూపురం పారిశ్రామికవాడలో పనిచేస్తున్న ఫర్హాన్(30), అమరాపురం(M) చిట్నడుకు చెందిన సురేశ్(35) రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నల్లమాడ(M) కుటాలపల్లిలో బహిర్భూమికి వెళ్లిన సాయిసంకీర్తన(17), పెనుకొండలో స్నానానికి వెళ్లిన విజయేంద్ర కుమార్(53) నీటిలో మునిగి చనిపోయారు. చెన్నేకొత్తపల్లి(M) నామాలకు చెందిన వెంకటేశ్వరరెడ్డి కూతురి కోసం TPT వెళ్లి మృత్యువాత పడ్డారు.