News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 27, 2025
ADB: మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ కవిత

మాజీ మంత్రి జోగురామన్నను గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పక్షాన ఒత్తిడి పెంచుతామన్నారు.
News March 27, 2025
జగిత్యాల: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థులు కాలేజీలలో ఆన్లైన్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ తెలిపారు. దరఖాస్తు గడువు ను ఈనెల 31 నుండి మే 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News March 27, 2025
సిరిసిల్ల :ప్రభుత్వ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

సెర్ఫ్ క్రింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి డీ.ఎన్.లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీశాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి.దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్న సిరిసిల్లజిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.