News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 27, 2025
VKB: ఈ గ్రామంలో ఒకే ఇంటికే పల్లె పగ్గాలు!

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్లో పంచాయతీ రిజర్వేషన్లు ఓ కుటుంబానికే వరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ (ఎస్టీ జనరల్)తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో ఉన్న ఒక్క ఎస్టీ కుటుంబం ఎరుకలి భీమప్ప కుటుంబం మొత్తం పోటీ రంగంలో నిలబోనుంది. గ్రామంలో 494 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, ఎస్టీ వర్గానికి చెందిన భీమప్ప కుటుంబం ఒక్కటే ఉండటంతో మూడు స్థానాలకు అదే ఇంటి నుంచే అభ్యర్థులు రావడం ఖాయం.
News November 27, 2025
హీరోయిన్ కూడా మారారా!

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.
News November 27, 2025
కామారెడ్డిలో పటిష్ట భద్రత.. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం

కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 780సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను (క్రిటికల్ 223, సెన్సిటివ్ 557) గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాలలో వెబ్ కాస్ట్ ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. 38మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ సెల్ 9908712421 ఏర్పాటు చేశారు.


